మస్కట్‌కు విమాన సర్వీస్ ప్రారంభం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం) నుంచి ఒమన్ దేశ రాజధాని మస్కట్‌కు ఎయిర్ ఇండియా సంస్థ విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. వారానికి ఒక సర్వీస్ మాత్రమే నడుస్తుంది. ఈ విమాన సర్వీస్ ద్వారా ఇక్కడి నుంచి మస్కట్‌కు కేవలం 3.30 గంటలలోనే చేరుకోవచ్చు. 182 మంది ప్రయాణికుల సామార్ధ్యం కలిగిన ఎయిర్‌బస్ ఎ-321 విమానం ప్రతి మంగళవారం హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్ట్‌గా మస్కట్‌కు బయలుదేరి వెళ్తుంది. మస్కట్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు అక్కడికి చేరుకుంటుందని ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు.






