పీఓకే ప్రజలు భారత్ లో కలవండి.. కేంద్రం పిలుపు…

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్..భారత్ లో కలిపేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా..? కల్లోలిత, సంక్షోభిత పాకిస్తాన్ లో ఉండలేమన్న భావనకు పీఓకే ప్రజలు వచ్చేశారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. మొన్నటివరకూ పీఓకే .. తనంతట తానే భారత్ లో కలుస్తుందంటూ ప్రకటించిన రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఈసారి ఏకంగా పీఓకే ప్రజలకు కశ్మీర్ నుంచే పిలువునిచ్చారు. భారత్ దేశంలో కలవాలని సూచించారు. మిమ్మల్ని బారతీయులుగా చూసుకుంటామని బాస చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ రెండు కీలక ప్రకటనలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఆపితే.. పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. అదే సమయంలో పీఓకే ప్రజలు భారత్‌లో చేరాలని కోరారు ఆయన. పీఓకే ప్రజలను పాకిస్తాన్ విదేశీయులుగా పరిగణిస్తోందని… తామ దేశం మాత్రం వారిని సొంతవారిగా చూసుకుంటున్నామని చెప్పారు. పీఓకే ప్రజలను పాకిస్తాన్ విదేశీయులుగా పరిగణిస్తోందన్నారు రాజ్‌నాథ్ సింగ్. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఏఎస్జీ (ASG) స్వయంగా అఫిడవిట్‌లో తెలిపారన్నారు. ఇటీవల జరిగిన ఓ కేసుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసిన పాక్ సొలిసిటర్ జనరల్ పీఓకేను విదేశీగడ్డగా పేర్కొన్నట్టు చెప్పారు రాజ్‌నాథ్.
అందుకే.. భారత్‌లో చేరాలని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలను కోరుతున్నారన్నారు. వారంతా తమ వారే అన్నారాయన. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి… ప్రజల సమస్యలను తొలగించామన్నారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) - కాంగ్రెస్ కూటమి హామీపై రాజ్‌నాథ్‌సింగ్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం అది సాధ్యం కాదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్నారు రాజ్‌నాథ్‌సింగ్. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై… చాలా కాలం జమ్మూకాశ్మీర్‌లోని ప్రజల హక్కులను హరించారని… ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు, వాల్మీకి సంఘం, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కును పొందారని చెప్పారు.
ఎస్సీ వర్గానికి లబ్దిచేకూర్చాలన్న వాల్మీకి సంఘం ఏళ్ల నాటి డిమాండ్ కూడా నెరవేరిందన్నారు రాజ్‌నాథ్‌సింగ్. తొలిసారిగా ఎస్టీ వర్గానికి అసెంబ్లీలో సీట్లు రిజర్వ్ చేశారన్నారు. కాశ్మీర్ లోయలో కనిపిస్తున్న మార్పును ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. గత ఏడాది, భారతదేశంలో జీ20 నిర్వహించినప్పుడు… అందులో ఒక సమావేశాన్ని శ్రీనగర్‌లో విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఇంతకు ముందు టెర్రరిజం స్పాట్‌గా పేరుపడ్డ జమ్మూకశ్మీర్… ఇప్పుడు టూరిజం స్పాట్‌గా మారిందన్నారు. ఇదివరకు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్లేందుకు చాలా సమయం పట్టేదని.. కానీ ఇప్పుడు కేవలం నాలుగున్నర గంటల్లో శ్రీనగర్ చేరుకోవచ్చని చెప్పారు.