ASBL NSL Infratech

అనంతలో వైఎస్‌ జగన్‌ నాలుగోరోజు ప్రజాసంకల్పయాత్ర

అనంతలో వైఎస్‌ జగన్‌ నాలుగోరోజు ప్రజాసంకల్పయాత్ర

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో నాలుగోరోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. 29వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నేటి (గురువారం) ఉదయం 8 గంటలకు సింగనమల నియోజకవర్గం సింగనమల మండలంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారితో మమేకమైన వైఎస్ జగన్ 8.30 గంటలకు కల్లుమడి చేరుకొని వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేశారు.

అనంతరం 10.30 గంటలకు వైఎస్‌ జగన్‌ గుమ్మేపల్లి చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పార్టీ జెండాను ఎగరవేస్తారు. మధ్యాహ్నం 12.00 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. రాత్రి 7.30 గంటలకు బస చేస్తారు. బుధవారం అనంతపురం జిల్లా కొట్టాలపల్లి, నాగులాపురం క్రాస్‌ రోడ్డు, గంజికుంటపల్లి మీదుగా చిట్టురు, తరిమెల వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.

Praja Sankalpa Yatra Day 29

YS Jagan Mohan Reddy begins his padayatra in Kallumadi village, Singanamala Constituency.

YSRCP chief YS Jagan Mohan Reddy will interact with the people of Kallumadi & Gummepali villages along his Padayatra route.


Click here for Photogallery

 

Tags :