ASBL NSL Infratech

బంప‌రాఫ‌ర్ ప‌ట్టేసిన ట‌బు

బంప‌రాఫ‌ర్ ప‌ట్టేసిన ట‌బు

ఇప్పుడంటే సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయి మంచి పాత్రలు పట్టేస్తున్నారు కానీ సీనియర్ హీరోయిన్ టబు తెలుగు ప్రేక్షకులకు నిన్నే పెళ్లాడతా పండుగానే బాగా గుర్తుండిపోయింది. వెంకటేష్ కూలి నెంబర్ వన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హిందీలో సెటిలయ్యాక ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. చిరంజీవి అందరివాడు, బాలకృష్ణ పాండురంగడులో కనిపించినా అవి ఆశించిన ఫలితాలివ్వలేదు. కట్ చేస్తే సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తిరిగి తీసుకొచ్చారు. ఆచితూచి అడుగులు వేస్తున్న టబు ఏకంగా హాలీవుడ్ ఆఫర్ పట్టేశారు.

కూలి నెం.1 సినిమాతో టాలీవుడ్ లో కాలు పెట్టిన ట‌బు ఆ త‌ర్వాత హిందీలో సెటిల‌య్యింది. బాలీవుడ్ కు వెళ్లాక ఇక్క‌డ పెద్ద‌గా ఫోక‌స్ పెట్ట‌లేదు ట‌బు. చిరంజీవి అంద‌రివాడు, బాలయ్య పాండురంగ‌డు సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికీ అవేమీ ఆమెకు ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. మ‌ళ్లీ త‌ర్వాత చాలా ఏళ్ల‌కు అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో మెరిసింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ట‌బుకి ఏకంగా హాలీవుడ్ మూవీలో బంప‌రాఫ‌ర్ కొట్టేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న డ్యూన్ సిరీస్ లో త్వ‌ర‌లో అదే టైటిల్ కు ప్రోఫెసిని జోడించి భారీ బ‌డ్జెట్ తో ప్రీక్వెల్ ను తీయ‌బోతున్నారు. సిస్ట‌ర్ ఫ్రాన్సెస్ గా ట‌బు చాలా కీల‌క పాత్ర ద‌క్కించుకుంది. సై-ఫై జానర్ లో రూపొందుతున్న ఈ డ్యూన్ ప్రోఫెసి కోసం ట‌బు ఎక్కువ కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ వ‌య‌సులో ట‌బు ఇలాంటి కెరీర్ బ్రేక్ అందుకోవ‌డమంటే మాటలు కాదు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :