ASBL NSL Infratech

జ'గన్' పేలిందా..?

జ'గన్' పేలిందా..?

ఏపీ ఎన్నికల్లో ఓటరు ఎవరిని కరుణించాడు..? వైనాట్ 175 అన్న సీఎం జగన్ మాటలు.. ఓటరు మనసును తాకాయా..? సంక్షేమ బటన్ కాస్తా ఈవీఎంలపై ప్రభావం చూపిందా..? అందుకే అవ్వా, తాత, అక్క,చెల్లెమ్మలు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారా...? అందుకే ఈసారి ఓట్ల శాతం విపరీతంగా పెరిగిందా...? అంటే అవుననే అంటున్నారు వైసీపీ అగ్రనేతలు.. ఈసారి కచ్చితంగా సీఎంగా జగన్ రావడం పక్కా అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వరుసగా సంక్షేమపథకాలు అమలు చేస్తున్నారు. బటన్ నొక్కి నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బు పంపిణీ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఓటింగ్ సమయంలో తమ సర్కార్ చేసిన మంచిని గుర్తుంచుకుని ఓటేశారని దీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ చెప్పారంటే చేసి తీరతారన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి అధికశాతం ఓటింగ్ నమోదైందని..ఇది ప్రభుత్వ సానుకూల ఓటన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారితో టీడీపీ శకం ముగిసినట్లే అంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఎంపీవిజయసాయిరెడ్డి. ప్రజల నాడి చూస్తుంటే అధికశాతం సీట్లు తమ ప్రభుత్వానికి వచ్చినట్లే కనిపిస్తోందన్నారు. కూటమి అలవికాని హామీలను ప్రజలు పట్టించుకోలేదని.. పనిచేస్తున్న ప్రజాప్రభుత్వానికి మరోసారి పట్టం గట్టారని చెబుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేకే టీడీపీ శ్రేణులు.. గుంటూరు జిల్లాలో దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.తాము తలచుకుంటే అసలు టీడీపీ నేతలు తిరిగే ప్రసక్తే ఉండదంటున్నారు.

ఎన్డీఏ సర్కార్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. మరోసారి మళ్లీ కొత్త హామీలను మూటగట్టుకుని వచ్చి మోసం చేయాలని చూస్తోందన్న సీఎం జగన్ ప్రసంగాలు ప్రజలను కచ్చితంగా తాకాయంటున్నారు వైసీపీ శ్రేణులు. తాము గెలిచేశామని.. కచ్చితంగా విశాఖలో సీఎం జగన్ ..జూన్ 4న ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు సీనియర్ మంత్రి బొత్స సత్యన్నారాయణ.మళ్లీ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుండడంతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం కానుందన్నారు. ఇప్పటికే పలు సంక్షేమపథకాలను అమలు చేస్తున్న జగనన్న ప్రభుత్వం.. వీటిని మరింత విస్తరిస్తుందని వివరిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :