ASBL NSL Infratech

బంగారం లాంటి ఛాన్స్ ను మిస్ చేసుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి

బంగారం లాంటి ఛాన్స్ ను మిస్ చేసుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి

మే 17న రిలీజ్ కావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మే 31కు పోస్ట్‌పోన్ అయిన విష‌యం తెలిసిందే. రీజ‌న్స్ ఏవైనా స‌రే సినిమాను పోస్ట్ పోన్ చేయాల‌నే డెసిష‌న్ క‌రెక్ట్ కాద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఎల‌క్ష‌న్ హ‌డావిడి పూర్తైంది కాబ‌ట్టి జ‌నాలంతా మెల్లిగా ఎంట‌ర్టైన్మెంట్ వైపు మ‌ళ్లుతారు. నిన్న‌టివ‌ర‌కు ప్ర‌చారాలు, డ‌బ్బు పంప‌కాలు, టీవీల్లో డిబెట్స్, ఓట్ల దందాల‌తో బిజీ అయిన ఆడియ‌న్స్ కు అర్జెంటుగా ఎంట‌ర్టైన్మెంట్ కావాలి.

అలాంటప్పుడు వాళ్ల‌కున్న ఫ‌స్ట్ ఆప్ష‌న్ సినిమానే. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ లేవు. కృష్ణ‌మ్మ యావ‌రేజ్ కంటెంట్ తో నెట్టుకొస్తోంది. టైమింగ్ చూసుకుని వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌తినిధి2 వీక్ కంటెంట్ వ‌ల్ల తేలిపోయింది. ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఆల్రెడీ సైలెంట్ అయిపోయింది. దీంతో ప్ర‌స‌న్న‌వ‌ద‌నం సినిమాను ర‌కర‌కాలుగా ప్ర‌మోట్ చేస్తూ క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్నారు మేక‌ర్స్. కానీ అవేమీ వ‌ర్క‌వుట్ అవ‌డం లేదు.

అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఈ వారమే వ‌చ్చి ఉంటే భారీ ఓపెనింగ్స్ వ‌చ్చేవ‌ని బ‌య్య‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గ‌తేడాది డిసెంబ‌ర్లోనే రిలీజ్ కావాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఇప్ప‌టికీ రెడీ అవ‌క‌పోవ‌డ‌మేంట‌ని అంద‌రూ షాక‌వుతున్నారు. దానికి తోడు మే 31కి భారీ పోటీనే ఉంది. సోలోగా రిలీజై మంచి వ‌సూళ్లు ద‌క్కించుకోవాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఇప్పుడు క‌లెక్ష‌న్స్ ను షేర్ చేసుకోవాల్సి వ‌స్తుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :