ఊపిరి పీల్చుకున్న ప్రభాస్ ఫ్యాన్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా నిర్మాత అశ్వినీదత్ బహిరంగంగా టీడీపీ కూటమికి మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నిన్నటివరకు టెన్షన్ పడ్డారు. ఒకవేళ వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే జూన్ 27న టికెట్ రేట్స్, స్పెషల్ షో విషయంలో ఇబ్బందులు ఎదురువుతాయని ఫ్యాన్స్ కంగారు పడ్డారు.
కానీ ఏపీలో నిన్న పోలింగ్ శాతం చూశాక ట్రెండ్ ప్రకారం రూలింగ్ పార్టీ మారే ఛాన్సులున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ఇది నిజమవుతుందా లేదా తెలియడానికి మరో 20 రోజుల టైమ్ పడుతుంది. కానీ ఈ పరిణామాలన్నింటినీ మంచి శకునాలుగా భావిస్తున్నారు కల్కి ఫ్యాన్స్. టీడీపీ అధికారంలోకి వస్తే సినీ రంగానికి సంబంధించి విపరీతమైన ఆంక్షలుండవు.
తెలంగాణలో లానే టికెట్ రేట్స్ పెంచుకునే వీలు, రాయితీలు లభిస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన నమ్మకముంది. పైగా కూటమిలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోనే కాబట్టి అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుందని ఆశపడుతున్నారు. దానికి తోడు జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక రిలీజయ్యే మొదటి పాన్ ఇండియ సినిమా కావడంతో దేశమంతటా సినిమాకు భారీ క్రేజ్ ఉంటుంది.