ASBL NSL Infratech

ఆ ప‌ని కానిచ్చేసిన దీపికా

ఆ ప‌ని కానిచ్చేసిన దీపికా

ప్ర‌భాస్, దీపికా ప‌దుకొణె హీరోహీరోయిన్లుగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం క‌ల్కి 2898ఏడీ. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియాలోనే ఫ‌స్ట్ ఫ్యూచ‌రిస్టిక్ కాన్సెప్ట్ సినిమాగా తెర‌కెక్కుతుంది.

దీపికా కెరీర్లోనే ఈ సినిమా అతి పెద్ద మూవీ కావ‌డం విశేషం. క‌ల్కి కోసం దీపికాకు భారీ రెమ్యూన‌రేష‌న్ కూడా ముట్టింది. ఇదిలా ఉంటే దీపికా తాజాగా క‌ల్కిలోని త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ పూర్తి చేసింద‌ట‌. హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో దీపికా త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తిగా ఉన్న దీపికా జూన్ నుంచి పూర్తి విశ్రాంతిలోకి వెళ్ల‌నుంది.

ఈ నేప‌థ్యంలో అంద‌రి కంటే ముందుగా దీపికా త‌న డ‌బ్బింగ్ ను పూర్తి చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో పాటూ ప్ర‌మోష‌న్స్ కు కావాల్సిన ఇంట‌ర్వ్యూలు కూడా ముందుగానే ఇవ్వ‌నుంద‌ట దీపికా. త్వ‌ర‌లోనే క‌ల్కి ప్ర‌మోష‌న్స్ కోసం దీపికా స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాను హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే హాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దీపికా ఇమేజ్ ఇత‌ర దేశాల్లో ఈ సినిమాకు ప్ల‌స్ కానుంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :