ASBL NSL Infratech

బాలీవుడ్ హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతున్న మ‌హాన‌టి

బాలీవుడ్ హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతున్న మ‌హాన‌టి

సౌత్ హీరోయిన్లంతా ఈ మ‌ధ్య బాలీవుడ్ ని టార్గెట్ చేశారు. రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతే ఏదొక సినిమా వ‌ర్క‌వుట్ అవ‌క‌పోతుందా అనే నమ్మ‌కంతో ముందుకెళ్తున్నారు. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా ఈ ఫార్ములానే ఫాలో అయింది. అమ్మ‌డు చేసిన మొద‌టి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా యానిమ‌ల్ సినిమా బ్లాస్ బ‌స్ట‌ర్ అవ‌డంతో నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

అందుకే పూజా హెగ్డే కూడా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా అక్క‌డే ఆఫ‌ర్ల కోసం ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడదే దారిలో మ‌హాన‌టి కీర్తి సురేష్ కూడా వెళ్తుంది. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ తేరిని బాలీవుడ్ లో వ‌రుణ్ ధావ‌న్ తో బేబీ జాన్ గా రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమాలో కీర్తినే హీరోయిన్. కీర్తికి బేబీ జాన్ బాలీవుడ్ డెబ్యూ. ఇది కాకుండా కీర్తికి అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ రానుంద‌ని తెలుస్తోంది.

ప్రియ‌ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న కామెడీ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ కు అలియా భ‌ట్, కియారా అద్వానీ పేర్ల‌తో పాటూ కీర్తి పేరు కూడా ప‌రిశీలన‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో ఎవ‌రు ముందు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే వారిని ఫైన‌ల్ చేయ‌నున్నార‌ట. బ్లాక్ మ్యాజిక్ మీద సీరియ‌స్ జాన‌ర్ లో సినిమాను న‌డిపిస్తూనే ఎంట‌ర్టైన్మెంట్ ఉండేలా చూస్తున్నాడ‌ట డైరెక్ట‌ర్. హీరో అక్ష‌య్ కుమార్ అయిన‌ప్ప‌టికీ హీరోయిన్ కు ఎక్కువ పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండ‌టంతో హీరోయిన్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడ‌ట డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :