రిస్క్ చేస్తున్న తేజ సజ్జ?
హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జ. ఈ టాలెంటెడ్ హీరోకి హనుమాన్ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. బలమైన కంటెంట్ పడితే ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే తేజ నెగ్గుకురాగలడనే నమ్మకం నిర్మాతల్లో వచ్చేసింది. అందుకే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తేజ సజ్జ హీరోగా రూపొందిస్తున్న మిరాయ్ ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
తేజ కూడా వచ్చిన ప్రతి ఆఫర్ ను ఒప్పుకోకుండా తన తర్వాతి సినిమాల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇదిలా ఉంటే తేజ తీసుకున్న డెసిషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కు తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది. లైగర్ తర్వాత పూరీతో పని చేయడానికి ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కారణంతో రామ్ ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా హిట్ అయితే తప్పించి తిరిగి పూరీ మీద నమ్మకం కలగదు. ఆ నమ్మకం కలగాలంటే జులై వరకు ఆగాల్సిందే. మరి తేజ సజ్జ ఇవేమీ ఆలోచించకుండానే పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా ఇది కేవలం రూమరేనా అన్నది తెలియాల్సి ఉంది.