ASBL NSL Infratech

తానా ఎన్నికల్లో అధ్యక్ష పోటీ వీరి మధ్యేనా?

తానా ఎన్నికల్లో అధ్యక్ష పోటీ వీరి మధ్యేనా?

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో ముఖ్యమైన నామినేషన్ల పర్వం ముగిసిందని, అందిన సమాచారం మేరకు అధ్యక్ష పదవులకు ఇద్దరు పోటీపడుతున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు రెండు వర్గాల మధ్యే జరుగుతున్నట్లు సమాచారం. గతంలో కలిసిపోటీ చేసిన నిరంజన్‌ వర్గం, అంజయ్య చౌదరి వర్గం ఇప్పుడు విడిపోయింది. అంజయ్య వర్గం, నరేన్‌ కొడాలి వర్గం కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెబుతున్నారు. అలాగే నిరంజన్‌ వర్గం తనకు ఉన్న శక్తియుక్తులన్నింటినీ చాటి ఎన్నికల్లో సత్తాను చాటాలని చూస్తోంది.

కాగా ప్రస్తుత జరుగుతున్న ఎన్నికల్లో అన్నీ పదవులకు నామినేషన్లు భారీ ఎత్తునే వేసినట్లు సమాచారం. 4 బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌, 29 ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మరియు 7 తానా ఫౌండేషన్‌ ట్రస్టీ పదవులు కలసి మొత్తంగా 40 పదవులకు పోటాపోటీ నామినేషన్లను 2 వర్గాలు తమ తమ వాళ్ళ చేత వేయించినట్లు తెలుస్తోంది.  తానా వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి కోసం మిచిగాన్‌ వాసి శ్రీనివాస గోగినేని, వర్జీనియా వాసి నరేన్‌ కొడాలి పోటీ పడుతున్నారు. ఇద్దరూ తానాలో అత్యంత సీనియర్లే కాక ఇంతకూ మునుపు ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఉండటంతో పాటు వర్గాల దన్ను పుష్కలంగా ఉండటంతో ఈ సారి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తాజా సమాచారం మేరకు ఇద్దరి అధ్యక్ష అభ్యర్థుల ప్యానెల్‌ లోను అనుభవము తో పాటు మహిళలు, యువత కలగలిసిన టీమ్‌ లు సమకూరడంతో ఎన్నికల సరళి మరియు ఫలితాలపై ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా చర్చలు సాగుతున్నాయి.

 

 

Tags :