ASBL NSL Infratech

తానా లో ఎన్నికల జాతరకు తెర లేచింది...

తానా లో ఎన్నికల జాతరకు తెర లేచింది...

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో ఎగ్జిక్యూటివ్‌ కమిటి, బోర్డ్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నోటిఫికేషన్‌ జారీ అయింది. అయినంపూడి కనకం బాబు నేతృత్వంలోని ఎన్నికల కమిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తానా కార్యదర్శి సతీష్‌ వేమూరి ఈమెయిల్‌ ద్వారా ఈ నోటిఫికేషన్‌ను పంపించారు. జనవరి 31 ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, ఫిబ్రవరి 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 23న అభ్యర్థుల నామినేషన్‌ ధ్రువపత్రాల పరిశీలన తరువాత సమాచారం ఇస్తారు. మార్చి 2వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా పేర్కొన్నారు. మార్చి5న పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటిస్తారు.  ఏప్రిల్‌ 21 వరకు బ్యాలెట్‌ పత్రాలను స్వీకరిస్తారు ఏప్రిల్‌ 22 ఓట్ల లెక్కింపు, ఏప్రిల్‌ 23న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

 

 

Tags :