America : మహిళలు చిన్నారులకు సంకెళ్లు వేయలేదు : ఎంఈఏ

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయ వలసదారులను ట్రంప్ (Trump) యంత్రాంగం వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని నిర్బంధించి తీసుకొస్తుండటంపై విమర్శలు వచ్చాయి. వీటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం (Central Government) గతవారం రెండు బ్యాచ్‌లలో వచ్చిన వలసదారుల్లో మహిళలు(Women), చిన్నారుల (children) కు సంకెళ్లు వేయలేదని స్పష్టం చేసింది. వలసదారులను స్వదేశానికి పంపించే సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించడంతోపాటు మతపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని అమెరికా (America) ప్రభుత్వం వద్ద ప్రస్తావించాం. దాని ప్రకారం ఫిబ్రవరి 15, 16 తేదీల్లో అమృతసర్‌కు వచ్చిన వారిలో మహిళలు, చిన్నారులకు ఎలాంటి సంకెళ్లు వేయలేదు అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) వెల్లడిరచారు.