విప్రో ఉద్యోగులకు శుభవార్త…
ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఉద్యోగులకు శుభవార్తను అందించింది. పనితీరు ఆధారంగా వేతనపెంపు అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని సిబ్బంది ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. వేతన పెంపునకు సంబంధించి ఇప్పటికే పలువురు సిబ్బందికి ఈ`మెయిల్ ద్వారా సమాచారం అందించిన సంస్థ.. మరికొన్ని రోజుల్లో మిగతావారికి కూడా తెలియచేయనున్నది. ఈ సందర్భంగా విప్రో మావన వనరుల విభాగ అధిపతి సారభ్ గోవిల్ మాట్లాడుతూ పనితీరు ఆధారంగా 96 శాతం మంది సిబ్బందికి వేతనాన్ని పెంచినట్లు తెలిపారు. ఎంతమేరకు పెంచిన విషయాన్ని మాత్రం ఆయన వెల్లడిరచలేదు.






