వాట్సప్ మరో కొత్త ఫీచర్… ఇక డేట్ తో
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం మరో ఫీచర్‌ని పరిచయం చేసింది. సెర్చ్ మెసేజ్ బై డేట్ పేరుతో కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. వాట్సప్‌లోని మెసేజ్‌లు, వాయిస్ నోట్లను డేటా ఆధారంగా సులభవంగా వెతకటం కోసం ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. ఈ విషయాన్ని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లు అందించేలా వాబీటా ఇన్ఫో వెల్లడించింది. సాధారణంగా వాట్సప్‌లో ఎవరి మెసేజ్‌లు అయినా వెతకాలంటే సెర్చ్ ఆప్షన్‌ను వినియోగిస్తాం. సరిగ్గా ఫలానా మెసేజ్ అని గుర్తుంటే సులువే. అదే ఇరువురి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో గుర్తులేప్పుడు పాత సందేశాలను వెతుక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ తరచూ చాట్ చేసేవాళ్లో, గ్రూప్‌లైతే స్క్రోల్ చేస్తూ వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఫలానా రోజున మెసేజ్ పంపించారని గుర్తుంటే వెంటనే ఆ రోజు సందేశాలను సులువుగా వెతకొచ్చు. సాధారణంగా సెర్చ్‌లో వాయిస్ మెసేజ్‌లను వెతకడం కష్టం. అదే తేదీ ఆధారంగా అయితే సెర్చ్ మెసేజ్ బై డేట్ ఫీచర్ ఉపయోగపడుతుంది.






