Ramdas Athawale: వారిని బహిష్కరించండి.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే లపై కేంద్రమంత్రి రాందాస్ ఆఠవలే (Ramdas Athawale) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మహాకుంభమేళా (Mahakumbh Mela)ను సందర్శించకుండా హిందూ సమాజాన్ని అవమానపరిచారన్నారు. అందుకుగాను హిందూ ఓటర్లు, వారిని బహిష్కరించాలని, ఎన్నికల్లో వారి పార్టీలకు ఓట్లు వేయొద్దని అన్నారు. తరచు సమావేశాల్లో హిందుత్వం గురించి మాట్లాడే ఠాక్రే ఈ విధంగా ప్రవర్తించడం సరైన చర్య కాదని మండిపడ్డారు. ఈ విషయంలో వారు కనీసం ప్రజల మనోభావవాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు.