America : అమెరికా నుంచి మూడో విమానం

అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొరడా రaళిపిస్తున్న క్రమంలో ఆ దేశం నుంచి 112 మంది భరతీయులు (Indians) సైనిక విమానంలో ఆదివారం రాత్రి 10 గంటలకు అమృత్‌సర్(Amritsar) చేరుకున్నారు. ఇలా ఇప్పటికే రెండు విమానాలు అమెరికా నుంచి వచ్చాయి. ఇది మూడోది. తాజాగా వచ్చినవారిలో 44 మంది హరియాణావారు కాగా 33 మంది గుజరాత్‌వారు, 31 మంది పంజాబ్‌వారు ఉన్నారు. మిగిలిన వారు యూపీ, ఉత్తరాఖండ్(Uttarakhand), హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) వాస్తవ్యులు. వెనక్కివచ్చినవారి వివరాలను అధికారులు పరిశీలించిన తర్వాత వారి స్థస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరిన రెండో విమానంలో మరో 116 మంది వచ్చారు. అక్రమ వలసదారుల విషయంలో మానవీయంగా వ్యవహరించాలని అమెరికా అధికారులకు చెప్పామని ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటనలో ఆచరణలో అమలు కాలేదు. వీరిని కూడా అమెరికా అధికారులు సంకెళ్లు వేసే భారత్‌కు తీసుకొచ్చారు. తొలి విడతలో ఈ నెల 5న వచ్చిన భారతీయులకూ ఇదే తరహా అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే.