America : భారత వలసదారుల తరలింపు… స్పందించిన అమెరికా

తమదేశంలో అక్రమంగా ఉంటున్న భారత వలసదారులను వెనక్కి పంపడంపై అమెరికా (America) స్పందించింది. తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ (Immigration) చట్టాలను అమలు చేయడం అత్యంత ఆవశ్యకమని, అది తమ విధానమని పేర్కొంది. ఆ విమాన ప్రయాణం గురించి ఇంతకుమించి ఏం చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారత్‌లోని యూఎస్ దౌత్యకార్యాలయ ప్రతినిధి మాట్లాడారు. భారత్ (India)కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్‌సర్ (Amritsar)కు చేరుకున్న సంగతి తెలిసిందే. శ్రీ గురు రాందాస్ జీ (Sri Guru Ramdas Ji )అంతర్జాతీయ విమానాశ్రయంలో సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం దిగింది. ఇందులో హరియాణా, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.