Gutka In Assembly: అసెంబ్లీలో గుట్కా నమిలి ఊసిన ఎమ్మెల్యే.. మండిపడ్డ స్పీకర్

కొందరు ఎంత పెద్ద పదవులు చేపట్టిన తర్వాత కూడా నలుగురికి ఆదర్శంగా జీవించాలనే విషయాన్ని మర్చిపోతారు. అసలు తాము ప్రజాప్రతినిధులమనే స్పృహ ఉండదు కొందరికి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా అదే కోవలోకే వస్తాడు. ఈ ఘనుడు అసెంబ్లీలో గుట్కా నమిలడమే (Gutka In Assembly) కాకుండా.. అసెంబ్లీ హాల్‌లోనే ఉమ్మేశాడు. ఈ ఘటన యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా అసెంబ్లీకి వెళ్తుండగా వెలుగు చూసింది. అసెంబ్లీ ద్వారం దగ్గర ఎవరో గుట్కా తిని ఊసినట్లు మరకలు ఆయన కంటపడ్డాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఆయన… భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు. అది (Gutka In Assembly) ఓ ఎమ్మెల్యే పని అని వాళ్లు వెల్లడించారు. దాంతో మండిపోయిన స్పీకర్.. సదరు ఎమ్మెల్యే తనంతట తానుగా ముందుకు వచ్చి తప్పు ఒప్పుకోవాలని, లేదంటే తనే ఆ ఎమ్మెల్యే పేరు బయటపెడతానని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి (Gutka In Assembly) సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
https://twitter.com/i/status/