Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా విధించిన యూపీ కోర్టు

కాంగ్రెస్ కీలక నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) రూ.200 జరిమానా విధించింది ఓ యూపీ కోర్టు. ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరవ్వాల్సిన రాహుల్.. పదే పదే విచారణకు గైర్హాజరు అవ్వడంతోనే ఈ జరిమానా విధించినట్లు యూపీ కోర్టు తెలపింది. ఏప్రిల్ 14వ తేదీన తదుపరి విచారణకు రాహుల్ హాజరు కాకపోతే మాత్రం తీవ్రంగా చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీని (Rahul Gandhi) కోర్టు హెచ్చరించింది. 2022లో మహారాష్ట్రలో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. స్వాతంత్ర సమరవీరుడు వీర్ సావర్కర్‌పై విద్వేష వ్యాఖ్యలు చేశారు. సావర్కర్ ఒక బ్రిటిష్ సేవకుడని, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నారని రాహుల్ (Rahul Gandhi) చెప్పారు. ఈ వ్యాఖ్యలు వీర్ సావర్కర్‌ను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్ వేశారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అందులో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌కు సంబంధించి పలుమార్లు విచారణ జరగ్గా రాహుల్ మాత్రం కోర్టుకు రాలేదు. తాజాగా మరోసారి జరిగిన విచారణకు కూడా రాహుల్ (Rahul Gandhi) రాలేదు. ఆయన తరఫు న్యాయవాది ప్రన్షు అగర్వాల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారని, కాబట్టి ఆయనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, ఇలా పదే పదే విచారణకు రాహుల్ గైర్హాజరవడాన్ని కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఆయనకు రూ.200 జరిమానా విధించిన అప్పర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం.. తదుపరి విచారణకు రాహుల్ (Rahul Gandhi) తప్పకుండా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ తదుపరి విచారణకు కూడా రాహుల్ రాకపోతే ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.