Nitish Kumar మరింత వేగంగా బిహార్ అభివృద్ధి : నీతీశ్ కుమార్

కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బిహార్ (Bihar)కు ప్రాధాన్యం కల్పించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar) హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. బడ్జెట్‌లో బిహార్‌కు ప్రాధాన్యం కల్పించినందుకు ప్రధాని మోదీ(Modi), ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కేంద్ర బెడ్జెట్ సహాయపడుతుంది అని నీతీశ్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం బిహార్‌పై వరాలు కురిపించింది. రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ (Greenfield Airport), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.