Stalin : ఇందులో తమిళనాడు విజయం సాధించింది : స్టాలిన్

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ (Stalin) స్పందించారు. ఈ అంశం దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి అని వ్యాఖ్యానించారు. చెన్నై(Chennai)లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని లోక్‌సభ (Lok Sabha) నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామ ని తెలిపారు. జనాభాను నియంత్రించడం భారత్ (India) ముందున్న అతిపెద్ద లక్ష్యం. ఇందులో తమిళనాడు విజయం సాధించింది. అయితే తక్కువ జనాభా ఉండడం వల్ల పార్లమెంట్ సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఒకవేళ సీట్లు తగ్గితే 39 కాకుండా 31 మంది ఎంపీలు(MPs) మాత్రమే ఉంటారు అని పేర్కొన్నారు.