పేటీఎంకు మరోసారి గట్టి షాక్… ఒకేసారి ముగ్గురు!
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరోసారి గట్టి షాక్ తగిలింది. తాజాగా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిషేక్ అరుణ్, ఆఫ్‌లైన్ పేమెంట్స్ సీవోవో రేణు సాతి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సీవోవో అభిషేక్ గుప్తా రాజీనామాలు సమర్పించినట్లు తెలిసింది. గత ఐదేళ్లుగా పైగా పేటీఎంలో సేవలందిస్తున్న అభిషేక్ అరుణ్, కంపెనీ నుంచి వైదొలుగుతున్నట్టు లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు. అభిషేక్ గుప్తా, రేణు సాతి గతేడాదే పేటీఎంలో చేరగా ఇటీవల వీరిద్దరూ తమ రాజీనామాలు సమర్పించినట్లు పేర్కొంది. అయితే ఈ రాజీనామాలపై పేటీఎం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.






