BJP :బీజేపీ బహిరంగ సభలో ఆసక్తికర సంఘటన

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటీవల బీజేపీ (BJP) ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకొంది. ఈ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తన వద్దకు వచ్చిన బీజేపీ అభ్యర్థి పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకి అతడెవరు? అసలు ఆయన పాదాలకు ప్రధాని ఎందుకు నమస్కరించారనే దానిపై చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి హాజరైన ప్రధానిని పార్టీ నేతలంతా కలిశారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న మోదీ వద్దకు బీజేపీ అభ్యర్థి రవీంద్ సింగ్ నేగి (Ravind Singh Negi) వచ్చారు. ఆయన పాదాలకు నమస్కారం చేశారు. వెంటనే అతడిని అడ్డుకున్న ప్రధాని రవీందర్ పాదాలకు మూడు సార్లు నమస్కారం చేశారు. దీంతో అతడు ఎవరనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రవీందర్ సింగ్ నేగి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్(Councilor). పట్‌పర్‌గంజ్‌లోని వినోద్ నగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్, ఆప్ అభ్యర్థులు అనిల్ కుమార్(Anil Kumar), అవధ్ ఓజాకు పోటీగా బరిలోకి దిగారు.