Tejashwi Yadav: ఈ సీఎం అవసరమా?.. నితీష్ కుమార్‌పై తేజస్వీ యాదవ్ షాకింగ్ కామెంట్స్!

బీహార్ రాజకీయ వాతావరణం చాలా వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) మధ్య పదే పదే వాగ్యాదాలు జరుగుతున్నాయి. తాజాగా నితీష్‌పై తీవ్ర విమర్శలు చేసిన తేజస్వీ.. రాష్ట్రంలో నితీష్ అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ మండిపడ్డారు. నితీష్‌ను పాతపడిపోయిన వాహనంతో పోల్చిన తేజస్వీ.. రాష్ట్రం ముందుకు సాగడానికి కొత్త నాయకత్వం అవసరమని ఆయన సూచించారు.
పదవీ విరమణ వయస్సు సాధారణంగా 60 ఏళ్లుగా ఉన్నప్పుడు 75 ఏళ్ల ముఖ్యమంత్రి అవసరమా అని తేజస్వీ (Tejashwi Yadav) ప్రశ్నించారు. నితీష్ అలసిపోయారని, ప్రభుత్వంపై పట్టు కోల్పోయారని, దీని వల్ల బీహార్ నిలకడ కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన వాదించారు. “పాత, శక్తిలేని వాహనంతో రాష్ట్రం ముందుకు సాగదు. అభివృద్ధికి కొత్త దృష్టికోణం, శక్తి అవసరం. నితీష్ కుమార్ మానసికంగా రిటైర్ అయ్యారు; ఆయన కనీసం తన డిప్యూటీ సీఎంల పేర్లు కూడా గుర్తుంచుకోలేకపోతున్నారు. త్వరలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది,” అని తేజస్వీ (Tejashwi Yadav) ధీమా వ్యక్తం చేశారు.
వీరిద్దరి మధ్య ఇలాంటి వాగ్వాదాలు ఇదేం కొత్త కాదు. ఇటీవలే అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు తేజస్వీ (Tejashwi Yadav) ప్రయత్నిప్తే నితీష్ కుమార్ మండిపడ్డారు. తేజస్వీ తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ బీహార్ రాజకీయాల్లో ఎదగడానికి తనే కారణం అని నితీష్ అందరికీ గుర్తుచేశారు.