Thiru Ponmudi మంత్రి తిరు పొన్ముడికి చేదు అనుభవం!

ఫెయింజల్ తుపాను బీభత్సం సృష్టించింది. తమిళనాడు(Tamil Nadu) పుదుచ్చేరి సహా ఇతర ప్రాంతాల్లో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. పలువురిని పొట్టన పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రి తిరు పొన్ముడి (Thiru Ponmudi) కి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి రావడాన్ని గమనించిన వరద బాధితులు చేతుల్లో బురదతో స్వాగతం పలికారు. అంతేకాకుండా కొందరు ఆయన పై బురద చల్లారు.