Joymalya Bagchi : సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ (Joymalya Bagchi )ని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) నేతృత్వంలోని జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అభయ్ ఎస్.ఓక్, జస్టిస్ విక్రంనాథ్ కొలీజియం ఈ మేరకు ప్రకటించింది.దీనిని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే జస్టిస్ బాగ్గీ ఆరేళ్లకు పైబడి సుప్రీంకోర్టు (Supreme Court) లో సేవలందించంతోపాటు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం పొందుతారు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు న్యాయమూర్తిగా కొద్ది కాలం పనిచేశారు.