Sunita Williams : మార్చిలో భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్

అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన, నాసా(NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఎట్టకేలకు త్వరలో భూమి (Earth)కి చేరనున్నారు. ఆమెతో బాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ (Butch Wilmore) కూడా కిందకి రానున్నారు. మార్చి (March) మధ్యలో వారిద్దరిని భూమికి తీసుకువచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని నాసా ప్రకటించింది. సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రానికి చేరి గత వారానికి ఎనిమిది నెలలు పూర్తయ్యాయి.