Sunitha Williams: సునీత విలియమ్స్ వచ్చేది ఆరోజే!

అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రం లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha Williams )త్వరలో భూమిపైకి చేరనున్నారు. ఆమెతోపాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ (Butch Wilmore) కూడా కిందకి రానున్నారు. వారి కోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్(Space X) కు చెందిన క్రూ.10 అంతరిక్ష నౌకను పంపనున్నారు. నౌకలో కొత్తగా ఐఎస్‌ఎస్ (ISS) లోకి రానున్న వ్యోమగాములు వీరి బాధ్యతలు తీసుకోనున్నారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలో తిరిగి భూమికి మీదకు తాము బయల్దేరనున్నామని విల్మోర్ తెలిపారు.