64 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో… తొలిసారిగా

మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ( సీఎస్) సుజాత సౌనిక్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో 64 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. సీఎస్ నితిన్ కరీర్ పదవీ విరమణ చేయడంతో సుజాత ఈ పదవిలో నియమితులయ్యారు. ఆమె 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆమె భర్త మనోజ్ సౌనిక్ కూడా గతంలో సీఎస్‌గా పని చేశారు.