స్పైస్ జెట్ బంపర్ ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ఆదిరిపోయే ఆఫర్‌ను తీసుకువచ్చింది. వావ్ వింటర్ సేల్ పేరుతో ఓ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద డిసెంబర్ 27 నుంచి 31 మధ్య కాలంలో రూ.1,122 ప్రారంభ ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కింద చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణికులకు మాత్రమే రూ.1,122 ధరకు వన్ ఛార్జీలను అందిస్తున్నట్లు స్పైస్ జెట్ తన పోర్టల్ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కింద విమాన టికెట్లను బుక్ చేసే ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలో ఏమైనా మార్పులు వస్తే ప్రయాణ తేదికి 2 రోజుల ముందు వరకు వారి విమాన తేదీని మార్చుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 15 నుంచి ఏప్రిల్ 15 మధ్య కాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. స్పైస్‌జెట్ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్, స్పైస్ జెట్ మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు.






