South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు… ఇలాంటి కార్యక్రమాలు వద్దు

శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. రైళ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని, కర్పూరం వెలిగించవద్దని విజ్ఞప్తి చేసింది. యాత్రికుల రైళ్ల కోచ్‌ల లోపల పూజా విధానంలో భాగంగా కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం, అగరబత్తులు, సాంబ్రాణి పుల్లలు వెలిగించడం వంటివి చేస్తున్నట్టు రైల్వే (Railway )అధికారుల దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇలాంటి కార్యక్రమాల్లో రైళ్లలో చేయవద్దని ప్రయాణికులకు ప్రత్మేకంగా విజ్ఞప్తి చేసింది.
రైళ్లలో రైలు ప్రాంగణాలలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని విజ్ఞప్తి చేస్తుంది. మండే స్వభావం గల పదార్థాలతో ప్రయాణం చేయడం, వాటిని ఏ రూపంలోనైనా వెలిగించడం నిషేధించినట్లు రైల్వే శాఖ (Railve sakha) వెల్లడించింది. మండే స్వభావంగల పదార్థాలతో అగ్ని ప్రమాదాలకు దారితీసి మానవ ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా, రైల్వే ఆస్తులను సైతం నష్టం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి చర్యలు రైల్వే చట్టం-1989లోని సెక్షన్లు 67, 154, 164,165 ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడతాయని స్పష్టం చేస్తోంది.