భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఐసీసీ సమావేశం జరుగుతున్న వేళ భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. బీసీసీఐ చెప్పినట్లుగానే పాకిస్థాన్‌కు జట్టు వెళ్లేది లేదని స్పష్టం చేసింది. భద్రతాపరమైన కారణాలతో టీమ్‌ఇండియాను పంపించడం లేదని ఐసీసీ దృష్టికి బీసీసీఐ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ చూస్తోంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీసీసీఐ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. అక్కడ సెక్యూరిటీ సంబంధిత సమస్యలు ఎదురవుతాయనే ఆందోళనలో బీసీసీఐ ఉంది. అందుకే జట్టును పంపించడం లేదని పేర్కొంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. కాబట్టి, భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం లేదు అని స్పష్టం చేశారు.