Supreme Court : ఉచితాలపై …సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.

ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు (Political parties) వీటిని ప్రకటించే పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు మంచివి కావు. దురదృష్టవశాత్తూ వీటి కారణంగా ప్రజలు కష్టపడి పని చేసేందుకు ఇష్టపడడం లేదు. ఉచితంగా రేషన్ (Ration), డబ్బులు అందుతున్నాయి. ఎలాంటి పని చేయకుండానే డబ్బులు వస్తుండటంతోనే ఇలా జరుగుతోంది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే. కానీ, వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలి. ఉచితాల ద్వారా అలా జరుగుతోందా? ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదు అని జస్టిస్ బీఆర్.గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మూసిప్‌ా (George Musipa )తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.