శాంసంగ్ ఇండియాతో కలిసి కో–బ్రాండెడ్ వీసా క్రెడిట్ కార్డు విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్
భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ కంపెనీ శాంసంగ్, భారతదేశంలో మూడవ అతిపెద్ద బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్‌లు భాగస్వామ్యం చేసుకుని ప్రత్యేకంగా కో–బ్రాండెడ్ క్రెడిట్‌కార్డును వీసా సహకారంతో విడుదల చేశాయి. ఈ శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో వినియోగదారులు అన్ని శాంసంగ్ ఉత్పత్తులు, సేవలపై 10% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వినియోగదారులకు మరింత ఆనందం అందిస్తూ ఈ 10% క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను శాంసంగ్ ప్రస్తుతం అందిస్తున్న ఆఫర్లకు అదనంగా ఈఎంఐ, నాన్ ఈఎంఐ ఆఫర్లపై శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు అందిస్తుంది.
‘‘ఆవిష్కరణల శక్తితో వినియోగదారుల జీవితాలను సమూలంగా మార్చడాన్ని శాంసంగ్ వద్ద మేము నమ్ముతుంటాము. వీసా సహకారంతో విడుదల చేసిన శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఇప్పుడు శాంసంగ్ ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేస్తోన్న తీరును మార్చనుంది’’ అని కెన్ కాంగ్, అధ్యక్షులు మరియు సీఈఓ, శాంసంగ్, సౌత్ –వెస్ట్ ఆసియా అన్నారు.
‘‘వినియోగదారుల మారుతున్న అవసరాలను తీర్చడంతో పాటుగా సౌకర్యవంతమైన అనుభవాలను అందించడంపై దృష్టి సారించాము. ఈ కో– బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ను శాంసంగ్ ఇండియా, వీసా భాగస్వామ్యంతో విడుదల చేశాము. భారతదేశంలో అగ్రగామి 10 నగరాలతో పాటుగా టియర్2, 3 నగరాలలో సైతం ఈ సేవలను అందించనున్నాం’’ అని అమితాబ్ చౌదరి, ఎండీ– సీఈఓ, యాక్సిస్ బ్యాంక్ అన్నారు.
‘‘వినియోగదారులు నేడు అన్ని రకాల కొనుగోళ్లపై అత్యుత్తమ విలువ కోరుకుంటున్నారు. మా అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రతి నలుగురిలో మగ్గురు సంవత్సరంలో కనీసం ఒక ఎలకా్ట్రనిక్ అప్లయెన్స్ అయినా కొంటున్నారు. దాదాపు 40వేల రూపాయలను దీనిపై ఖర్చు చేస్తున్నారు. ఈ క్రెడిట్‌కార్డు పరిచయం చేయడానికి శాంసంగ్, యాక్సిస్ బ్యాంక్‌తో భాగస్వామ్యం చేసుకోవడం సంతోషంగా ఉన్నాము’’అని సందీప్ ఘోష్, గ్రూప్ కంట్రీ మేనేజర్, ఇండియా అండ్ సౌత్ ఆసియా, వీసా అన్నారు.






