Rishi Sunak :ముంబయిలో బ్యాట్ పట్టిన రిషి సునాక్

బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak)ముంబయిలో పర్యటించారు. ఈ సందర్భంగా దక్షిణ ముంబయిలోని పార్సీ జింఖానా గ్రౌండ్‌లో క్రికెట్ (Cricket )ఆడుతూ ఎంజాయ్ చేశారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుకుండా నా ముంబయి పర్యటన ఎప్పుడూ ముగియదు అని పేర్కొన్నారు. జైపుర్(Jaipur)లో ఐదు రోజులపాటు జరుగుతోన్న లిటరేచర్ ఫెస్టివల్ (Literature Festival )లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్‌కు వచ్చారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సునాక్ అనంతరం ముంబయి(Mumbai)కి చేరుకున్నారు. స్థానిక పార్సీ జింఖానాకు వెళ్లారు. క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటిస్తూ క్లబ్‌లో సాధించిన విజయాల గురించి తెలుసుకున్నారు. అనంతరం బ్యాట్ చేతపట్టి కాసేపు క్రికెట్ ఆడారు.