FM Nirmala Sitharaman: రూపాయి విలువ పడిపోవడానికి కారణాలవే: నిర్మల సీతారామన్

ఇటీవలి కాలంలో రూపాయి విలువ మరీ దారుణంగా పడిపోతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు చాలారోజులుగా టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో కూడా రూపాయి విలువపై ప్రశ్నలు తలెత్తాయి. వీటికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (FM Nirmala Sitharaman) బదులిచ్చారు. రూపాయలి విలువ పడిపోవడానికి పలు అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులే కారణమని, దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైన మార్గంలోనే నడుస్తోందని ఆమె (FM Nirmala Sitharaman) స్పష్టం చేశారు. ‘మిడిల్ ఈస్ట్‌లో అస్థిరత, రష్యా- ఉక్రెయిన్ యుద్ధాలు అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ అంతర్జాతీయ, దేశీయ కారణాలు కూడా భారత రూపాయిని నెగిటివ్‌గా ప్రభావితం చేశాయి. కేవలం భారతే కాదు, ఇతరత్రా ఎన్నో దేశాల కరెన్సీలు కూడా ఈ సమయంలో డీలాపడ్డాయి’ అని నిర్మల (FM Nirmala Sitharaman) గుర్తుచేశారు. ప్రపంచంలో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తామని ఆమె స్పష్టం చేశారు.