అనిల్ అంబానీకి ఎదురుదెబ్బ… రిల్ క్యాపిటల్ బోర్డును
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ మరింతగా దివాలా తీయడమే దీనికి కారణం. కంపెనీ బోర్డును రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. చేసిన అప్పులను తీర్చడంలో కంపెనీ విఫలం కావడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రాథమిక విచారణలో కంపెనీ నిర్వహణకు సంబంధించిన అనేక తప్పిదాలు ఉన్నట్లు ఆర్బీఐ గుర్తించింది. రిలయన్స్ క్యాపిటల్ బోర్డు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందున బ్యాంక్ ఆప్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వర్ రావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది.






