ఆర్బీఐ కీలక నిర్ణయాలు.. హోమ్ లోన్ లపై
కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన చేశారు. కమర్షియల్ బ్యాంకులకు రెపో రేటు ప్రకారం ఆర్బీఐ రుణాలు అందజేస్తుంది. అయితే రెపో రేటు పెరగడం వల్ల కార్పొరేట్లు, వ్యక్తిగత కష్టమర్లకు ఇక నుంచి రుణాలు మరింత భారం కానున్నాయి. 50 బేసిస్ పాయింట్లు పెంచడ వల్ల రెపో రేటు 5.90 శాతానికి పెరిగింది. తొలి క్వార్టర్లో జీడీపీ అంచనాలకు మించి తగ్గినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7 శాతం ఉందని, రెండవ క్వార్టర్లో 6 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడిరచింది.






