స్టాలిన్ సంచలన నిర్ణయం.. ఆర్థిక మండలిలో

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‍గా నిలుస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో ఆర్థిక సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఇందులో నోబెల్ బహుమతి విజేత, ఆర్థికవేత్త ఎస్తేర్ డుఫ్లో, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరంతా సలహా మండలిలో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి స్టాలిన్‍కు ఆర్థిక, సామాజిక విధానాలపై ఈ కౌన్సిల్ సలహాలు, సూచనలు చేయనుంది. ది ఎస్తేర్ డుఫ్లో, రఘురామ్ రాజన్ సహా మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, సామాజిక శాస్త్రవేత్త జీన్ డ్రేజ్, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్ నారాయణ్ సభ్యులుగా ఉన్నారు.