Rashtrapati Bhavan :రాష్ట్రపతి భవన్‌లో పెళ్లిసందడి

దేశ రాజధాని ఢల్లీిలోని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan )లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్‌లో పీఎస్‌వోగా సేవలు అందిస్తున్న సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా (Poonam Gupta) వివాహానికి ఈ అత్యున్నత స్థాయి భవనం వేదికగా నిలవనుంది. రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరెసా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుకను నిర్వహించేందుకు రాష్ట్రప్రతి ద్రౌపదీ ముర్ము ప్రత్యేకంగా అనుమతి మంజూరు చేశారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ (Assistant Commandant) గా సేవలు అందిస్తున్న అవనీశ్ కుమార్ (Avanish Kumar )తో ఫిబ్రవరి 12న పూనమ్ గుప్తా వివాహం జరగనుంది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ఆమె, 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. అనంతరం సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పోస్టింగ్ లభించింది. గణతంత్ర దినోత్సవ కవాతులో సీఆర్‌పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ సారథ్యం వహించారు.