అయోధ్య ఫలితం.. గుజరాత్‌లోనూ రిపీట్

అయోధ్యలో బీజేపీని ఓడించినట్లే, గుజరాత్‌లోనూ ఆ పార్టీపై ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కలిసికట్టుగా పోరాడి అయోధ్యలో బీజేపీ ఓడించినట్లే, గుజరాత్‌లోనూ నరేంద్ర మోదీని, ఆపార్టీని ఓడిస్తాం. విమానాశ్రయ నిర్మాణం పేరుతో అయోధ్యలోని సామాన్యుల భూములను కొలగొట్టారు. ఎంతో మంది తమ విలువైన స్థలాలు కోల్పోయారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులను, ధనవంతులను ఆహ్వానించిన కేంద్ర, స్థానికులను మాత్రం పిలవలేదు అని విమర్శించారు. ఇటీవల రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాహుల్ పరామర్శించారు.