రాహుల్ ప్రశ్నకు.. ప్రధాని ఏం చెప్పారంటే?

లోక్‌సభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని మతపరమైన వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా తప్పుబట్టింది. ఇక, రాహుల్ ప్రసంగంలో కొన్ని ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. మోదీజీ ఎప్పుడూ సీరియస్‌గా ఎందుకు ఉంటారని ఆయన అడగ్గా, ప్రధాని దీనికిగట్టి కౌంటర్ ఇచ్చారు. సభాపక్ష నేత అయిన ప్రధాని మోదీ విపక్షంతో ఎప్పుడూ సరదాగా మాట్లాడిన సందర్భాల్లేవ్. కనీసం మేం ఎదురుపడినప్పుడు ఆయన ముఖంలో చిరునవ్వు కూడా కన్పించదు. మోదీజీ ఎందుకు ఎప్పుడు సీరియస్‌గా ఉంటారు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దీనికి సభలో ఉన్న ప్రధాని వెంటనే బదులిస్తూ ప్రతిపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పించాయి అని అన్నారు. దీంతో అధికార పక్షం సభ్యులంతా నవ్వులు చిందించారు.