Radhika-Ananth Ambani: 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ జాబితాలో.. రాధికా-అనంత్ అంబానీ

న్యూయార్క్ టైమ్స్ సంస్థ రూపొందించిన 63 మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ 2024 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Ananth Ambani), ఆయన భార్య ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా (Radhika) మర్చంట్‌లకు చోటు లభించింది. ఈ ఏడాది జులైలో అత్యంత వైభవోపేతంగా జరిగిన వివాహం, అంతకుముందు జరిగిన ముందస్తు వేడుకల్లో ఈ యువజంట ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశాయని ఈ నివేదిక తెలిపింది. రియా కపూర్, డోల్సె-గబానా వంటి అగ్రగామి డిజైనర్ల దుస్తులు, ఆభరణాలు అందరినీ ఆకట్టుకున్నాయి.