Punjab: లేని శాఖకు 20 నెలలు పనిచేసిన ఆప్ మంత్రి.. మండిపడ్డ బీజేపీ

కాగితాలపై తప్ప కార్యనిర్వహణలో లేని ఒక శాఖకు పంజాబ్‌లో (Punjab Government) ఓ మంత్రి పనిచేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 20 నెలలపాటు సదరు మంత్రి సేవలు అందించిన తర్వాత పంజాబ్ ప్రభుత్వం (Punjab Government) ఈ విషయాన్ని గుర్తించింది. ఈ పొరపాటును సవరించేందుకు ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. అప్పుడుకానీ అసలు విషయం బయటపడలేదు. 2022 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆప్.. భగవంత్ మాన్ నేతృత్వంలో ప్రభుత్వం (Punjab Government) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2023లో మంత్రి వర్గాన్ని విస్తరించిన మాన్ సర్కారు.. కుల్దీప్‌సింగ్ ధలివాల్ (Kuldeep Singh Dhaliwal)కు ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యతలను ఆయనకు అప్పగించింది.
2024లో చివర్లో మరోసారి మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. కుల్దీప్ సింగ్‌కు కేటాయించిన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖకు ఆఫీసు కానీ, ఏమీ లేవు. జస్ట్ పేపర్స్‌పై ఆ శాఖ ఉన్నట్లు రాశారంతే. దీన్ని గుర్తించిన ప్రభుత్వం (Punjab Government).. సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్లు కొత్త నోటీఫికేషన్ విడుదల చేసింది. ఈ పరిణామంపై బీజేపీ మండిపడింది. ‘‘పంజాబ్‌లో పాలనను ఆప్ ఒక జోక్‌గా మార్చేసింది. అసలు లేని శాఖకు 20 నెలలుగా ఆ మంత్రి బాధ్యతలు నిర్వర్తించడం ఏంటి? అలాంటి శాఖ ఉందని, దాన్ని తన మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం సీఎంకు కూడా తెలియదా? ఇది చూస్తేనే పంజాబ్‌లో పాలన (Punjab Government) పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ ఆప్ సర్కారుపై విమర్శలు గుప్పించింది.