Priyanka Gandhi: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ సున్నా.. ఫలితాలపై ప్రియాంకా గాంధీ రియాక్షన్

ఢిల్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసిన బీజేపీ.. 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే జరిగింది. మూడో ప్రధాన పార్టీగా కాంగ్రెస్ బరిలో దిగినా కూడా.. ఈ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. వరుసగా మూడోసారి ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో విఫలమైంది. ఈ ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ఢిల్లీ ప్రజలు ‘మార్పు’ కోసం ఓటు వేశారని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వంతో పూర్తిగా విసిగిపోయిన ప్రజలు.. ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆమె (Priyanka Gandhi).. ‘ఇక మనం చేయాల్సిందల్లా మరింత కష్టపడి పనిచేయడమే. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడాలి’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.