Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము

కొన్నేళ్లుగా వర్గపోరుతో మండిపోతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన (President Rule In Manipur) విధించారు. ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్.. కొన్ని రోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకున్న సమయంలోనే బీరెన్ సింగ్ రాజీనామా చేయడం రాజకీయంగా దుమారం రేపింది. మణిపూర్ గవర్నర్ నుంచి నివేదిక అందుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ (President Rule In Manipur) విధిస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ‘రాజ్యాంగానికి కట్టుబడి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవడం అసాధ్యమని భావించడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని రాష్ట్రపతి భవన్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. బీరెన్ సింగ్ రాజీనామా అనంతరం సీఎం అభ్యర్థిగా ఎవరిని నియమించాలనే అంశంపై మణిపూర్ బీజేపీ నేతల ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఈ క్రమంలోనే మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన (President Rule In Manipur) విధించడం గమనార్హం.