Triveni Sangam :త్రివేణిసంగమంలో పుణ్యస్నానం చేసిన ప్రధాని

మహా కుంభమేళాకు వచ్చి పవిత్ర త్రివేణిసంగమం (Triveni Sangam)లో పూజలు, పుణ్యస్నానం చేయడం తనకు దక్కిన మహద్భాగ్యంగా ప్రధాని మోదీ (MODI) తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన ప్రధాని రుద్రాక్షలు చేతబూని త్రివేణిసంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. కాషాయ రంగు, జెర్సీ, నీలం రంగు ప్యాంటు ధరించి వేద మంత్రోచ్చారణల నడుమ గంగానది (Ganganadi) కి హారతి ఇచ్చి, పూజలు చేశారు. ఉదయం 10:30 గంటలకు ప్రయాగ్‌రాజ్ (Prayagraj )విమానాశ్రయంలో దిగిన మోదీ అక్కడి నుంచి హెలికాప్టరులో అరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) వెంట రాగా, ఘాట్ నుంచి మోటర్ బోటులో మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. 90 నిమిషాల తన పర్యటన అనుభూతిని ప్రధాని ఎక్స్ ద్వారా పంచుకున్నారు. మహాకుంభ్‌లో పాల్గొనడం ఓ ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా మనసంతా దైవికభావనలతో నిండిపోయింది. ఆ గంగమ్మ దేశవాసులందరికీ సుఖ శాంతులు ఇవ్వాలి. హర్ హర్ గంగే అని ఆయన వ్యాఖ్యానించారు.