PM MODI : ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump )తో భారత ప్రధాని మోదీ(Modi) ఫోన్లో మాట్లాడారు. రెండు దేశాల సంబంధాలను పైపైకి తీసుకువెళ్లడంపై వారు చర్చించుకున్నారు. పరస్పర ప్రయోజనం కలిగించే అంశాలకు, విశ్వసనీయ భాగస్వామ్యానికి ఇరు పక్షాలు కట్టుబడి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినందుకు ట్రంప్‌ను అభినందించినట్లు తెలిపారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ఇరువురు తరచూ మాట్లాడుకోవాలని, సాధ్యమైనంత త్వరలో పరస్పరం భేటీ కావాలని వారు నిర్ణయించుకున్నారు. వలసదారులపై ఆంక్షలు, టారిఫ్‌ల మోత గురించి వారి మధ్య ప్రస్తావనకు వచ్చిందా, లేదా అనేది వెంటనే తెలియరాలేదు. మిగతా దేశాల మాదిరిగానే భారత్‌లోనూ ఈ అంశంపై ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S.Jaishankar) ఇటీవల అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మార్కో రుబియో (Marco Rubio) తో సమావేశమై నేపథ్యంలో మోదీ-ట్రంప్ మాట్లాడుకోవడం విశేషం.