PM Modi: మఖానా.. ఓ సూపర్ ఫుడ్.. రోజూ తింటా: ప్రధాని మోదీ

బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ (PM Modi).. మఖానా (Makhana) ని సూపర్‌ఫుడ్‌గా అభివర్ణించారు. తన ఆహారపు అలవాట్లో మఖానాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. “సంవత్సరంలో ఉండే 365 రోజుల్లో కనీసం 300 రోజులు నా భోజనంలో మఖానా ఉంటుంది” అని మోదీ (PM Modi) తెలిపారు. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మఖానా ఉత్పత్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలన్నారు. అలాగే బిహార్‌లో.. తమ ప్రభుత్వం మఖానా బోర్డును ఏర్పాటు చేయనుందని కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విషయాన్ని మోదీ (PM Modi) గుర్తుచేశారు. దీని కోసం రూ.100 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మఖానా రైతులకు శిక్షణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఈ బోర్డు అండగా ఉంటుందని ఆమె వివరించారు. కాగా, భాగల్‌పుర్ పర్యటనలో ప్రధాని మోదీకి (PM Modi) మఖానాతో తయారు చేసిన ప్రత్యేకమైన దండను వేసి సత్కరించడం గమనార్హం.